తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష (29 నవంబర్, 2009) చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో, కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ ని జరపాలని బీఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించాలని కోరారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
