ప్రపంచ కుబేరుడు మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి అంకంలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం 250 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.2,110 కోట్లు) ఖర్చు పెట్టినట్టు గురువారం విడుదలైన ఫెడరల్ ఫైలింగ్స్ వెల్లడించాయి. ఇలా కేవలం ఒక దాత నుంచి వచ్చిన విరాళాలు ట్రంప్ పరిపాలన అమల్లోకి రావడానికి దోహదపడ్డాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు పెట్టారు.