అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రజలపై హామీల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న ఈ ఏన్నిక ల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో విస్తృతమైన సుంకాల విధానాన్ని (టారిఫ్‌ల పాలసీని) అమలు చేస్తానని ప్రకటించారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్‌లో ఆయన అమెరికా పార్లమెంట్ సభ్యులతో జరిపిన సమావేశంలో ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదించినట్టు తెలిసింది.