Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు… పుతిన్‌నే ఎక్కువగా

  దేశ నిఘా వ్యవస్థ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన దేశ ఇంటిలిజెన్స్‌ విభాగంలో పని చేసే వాళ్ల కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతానంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాం ట్రూత్‌ సోషల్‌ లో తన నమ్మకాలు మారాయంటూ.. సీఐఏ, నాసా, ఎఫ్‌బీఐ వంటి సైబర్‌ సెక్యూరిటీ తో సహా గూఢచార సంస్థలను తక్కువ చేస్తూ  రాసుకొచ్చారు. పైగా ఇలాంటి స్థితిలో తాను రష్యా అధ్యక్షుడినే ఎక్కువగా నమ్ముతానంటూ పోస్ట్‌ పెట్టారు. 2018లో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఉండగా పుతిన్‌కి మద్దతుగా మాట్లాడి పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.  ఈ వ్యాఖ్యలతో యూఎస్‌లోని రిపబ్లికన్లు, డెమోక్రటిక్‌ సభ్యులు విస్మయానికి గురయ్యారు. 

Social Share Spread Message

Latest News