క్లిష్టమైన ఆటిజం కేసులకు హోమియో ద్వారా చికిత్స అందించిన డా.కేర్ అధినేత, ప్రముఖ వైద్యులు డా.ఏ.ఎం.రెడ్డిని ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. ఆటిజం అంశంపై పరిశోధన చేసిన ఆయన వందలాది మందికి విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిసింది. అతి క్లిష్టమైన 20 ఆటిజం కేసులను చికిత్స అందించిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం ఫోర్బ్స్ ఆయనను ఎంపిక చేసింది. ఒక తెలుగు వ్యక్తిగా ఇది తనకెంతో గర్వకారణంగా ఉందని, తన బాధ్యత మరింత పెరిగిందని డా.ఏం.ఎం.రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో జీరో మెడికేషన్ విధానం ద్వారా వ్యాధి నిరోధకత, ఇమ్యూనోథెరఫీ విధానాల ద్వారా ఆటిజంను సమర్థంగా తగ్గించవచ్చని తెలిపారు. సకాంలో గుర్తిస్తే హోమియో ద్వారా నమయం చేయొచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నాలుకు చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఎ.ఎం.రెడ్డి చిన్నప్పటి నుంచి పరిశోధనాత్మక స్వభావాన్ని కలిగి ఉండే వారు. బెంగళూరులోని భగవాన్ బుద్ధ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ నుంచి 2007లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. డా.కేర్ హోమియోపతి పేరుతో ఒక బ్రాంచిని ప్రారంభించిన ఎ.ఎం.రెడ్డి ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే మొత్తం 50కి పైగా కేంద్రాలను నెలకొల్పారు.