డ్రీమ్ టీమ్ పతాకంపై దర్శక నిర్మాత హరనాథ్ పొలిచెర్ల కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్. భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రఘు బాబు, జెమిని సురేశ్ తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఈ నెల 16న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. ఆర్ .పి .పట్నాయక్ మాట్లాడుతూ అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయిన హరనాథ్ పొలిచెర్ల ఇండియాకు వచ్చి ఎంతోమంది ఆర్థిస్టులకు అవకాశం కల్పిస్తూ తెలుగు సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. తను ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే ఈ సినిమా నుండి విడు దలైన లిరికల్ సాంగ్స్ , ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ నెల 16న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న డ్రిల్ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. లవ్ జిహాద్ కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తీశానని హీరో హరనాథ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీకృష్ణ, సంగీతం: డీఎస్‌ఎస్‌కే.