బతుకమ్మ సంబురాలు కెనడా లో అంబరాన్నంటాయి. క్యాల్గరీ నగరంలో బోనెస్ కమ్యునిటీ అసోసియేషన్ హాల్‌లో క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. రంగు రంగుల పువ్వులతో ఎన్నారై తెలంగాణ బిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇప్పటి వరకు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఇదే పెద్దదని, ఆరు వందలకు పైగా మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్బెర్టా ప్రావిన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి మహ్మద్ యాసిన్, డిప్యూటీ మేయర్ వాంగ్ ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సత్యం కొంపల్లి, సుఖేష్ బవండ్ల,అశ్విన్ తుములు, రవి పల్లె, నమ్రత మంగు, రాహుల్ దండె, విష్ణు గబ్బుల, అసోసియేషన్ నలహాదారులు సునిల్ రాజవరం, అనంత్ మంగు, మదన్ చిలువేరి సహకారం మరిచిపోలేనిదని నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.














