యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ నిబంధనలను సడలించింది. ఇకపై విదేశీయులు యజమాని లేదా కంపెనీల స్పాన్సర్ షిఫ్‌తో పనిలేకుండా నేరుగా యూఏఈ లో ఉపాధి, ఉద్యోగాల్లో చేరవ్చని ప్రకటించింది. ఈ మేరకు కొత్త వీసాను ప్రకటించింది. యూఏఈ సాధారణంగా విదేశీయుల ఉపాధికి పరిమిత వీసాలు మాత్రమే జారీ చేస్తుంటుంది. పైగా ఇక్కడ దీర్ఘకాలిక నివాసిత అనుమతులు పొందడం కష్టతరం కానీ, ఇప్పుడు కొత్త వీసా ప్రకటనతో ఈ సౌలభ్యం కలగనుంది. గ్రీన్‌వీసా కలిగివున్న వారు కంపెనీ స్పాన్సర్ షిప్ లేకుండా నేరుగా ఉద్యోగాల్లో చేరవచ్చు. తల్లిదండ్రులు లేదా 25 ఏళ్ల లోపు పిల్లలకు ఇక్కడకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఇది అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, పీజీ విదార్థులు లక్ష్యంగా ఈ ప్రోత్సాహక వీసా విధానం ప్రకటించబడిరదని విదేశీ వాణిజ్య శాఖ సహాయమంత్రి థాని అల్`జౌదీ తెలిపారు.