అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ఎన్నికలను రిగ్గింగ్ (ఫలితాన్ని ప్రభావితం) చేస్తున్నాయని, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని అన్నారు. బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించటాన్ని, చేత్తో ఓట్ల లెక్కింపు ఎన్నికలను ఎలాన్ మస్క్ సమర్థించారు. పెన్సిల్వేనియాలో ఓ ప్రచార సభలో మస్క్ ప్రసంగిస్తూ నేను ఓ టెక్నాలజిస్ట్‌ను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు అని అన్నారు. ఎన్నికల్లో డొమినియన్ కంపెనీ ఈవీఎంల వాడకాన్ని మస్క్ వ్యతిరేకించారు. దేశమంతా బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికల్ని నిర్వహించాలని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-4-300x160.jpg)