అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంత రావు ని ఓడించినా బుద్ధి రాలేదని ఎన్నారై బీఆర్‌ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూడా బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కానీ, ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా అవే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి నిజంగానే వయసులో పెద్దవాడైతే సంస్కారవంతంగా మాట్లాడి, నిర్మాణా త్మక విమర్శలు చెయ్యాలి. కానీ ఇలా వీధి రౌడీ లాగా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. మైనంపల్లి హనుమంత రావు రాజకీయ జీవితం ముగిసిందని తాను ఎక్కడ నిలబడి ఓటు అడిగినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని తెలుసుకొని అసహనంతో, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శిం చారు. నేడు బీఆర్‌ఎస్ పార్టీకి తాత్కాలిక విరామం మాత్రమేనని కార్యకర్తలమంతా కేసీఆర్ వెంటే ఉంటామ న్నారు.