నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రానికి సర్వం సిద్ధమవుతున్నట్టు ఇటీవల విడుదలైన ఆయన స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. గతంలో చూసిన మోక్షజ్ఞ వేరు.. ఈ తాజా ఫొటోల్లో మోక్షజ్ఞ వేరు. ఆయన మేకోవర్ బాలయ్య అభిమానులకు అమితానందాన్ని కలిగిస్తున్నది.ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటశిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన డెబ్యూ కోసం ఇప్పటికే బాలయ్య పలు కథలు వింటున్నారు. తన తనయుడి తొలి సినిమా కథ విషయంలో బాలయ్యకు కచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తున్నది. దర్శకులుగా బోయపాటి, అనిల్ రావిపూడి, క్రిష్‌తో పాటు ప్రశాంత్‌వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది.
ఈ ఏడాదే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు మోక్షజ్ఞ సోదరీమణులైన బ్రహ్మణి, తేజస్విని పోటీపడుతున్నారనేది ఇన్‌సైడ్ టాక్. మరి ఇద్దరు అక్కల్లో ఆ ఛాన్స్ దక్కించుకునేది ఎవరు? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.