Namaste NRI

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఆదివారం వీడనుంది. నెల రోజులపాటు విస్తృత ప్రచారం చేసిన నాయకుల భవితవ్యం రేపు బయటపడనుంది. ఆదివారం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవ నుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠగా మారిన క్రమంలో అధికార బీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌తో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్, ఎగ్జిట్ పోల్స్ తమకు శుభవార్తను అందిస్తాయని ఆశ భావం వ్యక్తంచేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం అరగంట తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు.

ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ను ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుళ్లు, ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ సహా రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events