Namaste NRI

ఉత్కంఠ రేపుతున్న పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టలేదు. కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతు దారులు 99 సీట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ పార్టీ పరంగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ 71 సీట్లతో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ 53 స్థానాల్లోనూ, ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్‌ 17 స్థానాల్లోనూ, మిగిలిన స్థానాల్లో చిన్న చిన్న పార్టీలు గెలుపొందాయి. పీటీఐ మద్దతుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీలోనైనా చేరే అవకాశమున్నది. మరోసారి ప్రధా ని కావాలని పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ నవాజ్‌ షరీఫ్‌ గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారి తన చిన్న కొడుకు, పార్టీ అధినేత అయిన బిలావల్‌ భుట్టో జర్దారిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాడు. ఏ పార్టీలో చేరాలనే విషయమై పీటీఐ నాయకత్వం అంతర్గతంగా సంప్రదింపులు ప్రారంభించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events