మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మహాశివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమయ్యారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం వారి పాత్రల తాలూకు లుక్స్ విడుదల చేశారు. ఇందులో బ్రహ్మానందం పిలక పాత్రలో, సప్తగిరి గిలక పాత్రలో కనిపించనున్నారు. చేపకు ఈత, పులికి వేట, కోకిలకు పాట నేర్పిన గురువులు అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే అంటూ వీరిద్దరి పాత్రలను పరిచయం చేశారు. వీరిద్దరి కామెడీ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది.