Namaste NRI

అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు నుంచి ఫస్ట్‌ సింగిల్‌

సుహాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌, మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ గుమ్మా సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇది కొత్త కథ. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే కథ. ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నా. అందరికీ మంచి పేరుతెచ్చే సినిమా అవుతుంది అని హీరో సుహాస్‌ అన్నారు. సంగీత పరంగా కూడా సినిమా బావుంటుందని, నిజజీవిత అనుభవాల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని దర్శకుడు చెప్పారు. జనవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు నిర్మాత ఎస్‌కెఎన్‌ కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events