భారత్ నుంచి విమానాల రాకపోకలు సాగించడానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు మరికొన్ని దేశాల విమానాల రాకపోకలపై కువైట్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2020 మార్చి నుంచి కువైట్‌కు విమానాలు నిలిచిపోయి. అయితే ఈ నెల 22 నుంచి భారత్ నుంచి కువైట్‌కు విమానాలు మొదలుకానున్నాయి.
