![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-84.jpg)
గత కొద్ది నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు ఉపయోగించే ఆయుధాలను అమెరికానే విక్రయించిందని అమెరికన్ డెమోక్రటిక్ సోషలిస్టు సెనేటర్ బెర్నీస్ సాండర్స్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల ఆయుధ విక్రయాన్ని నిరోధించే తీర్మానాన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.అమెరికా సెనేట్ ఫ్లోర్‌లో ప్రసంగించిన సాండర్స్ ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా సహకారం నిలిపివేయాలని సాండర్స్ డిమాండ్ చేశారు. అమెరికా అందించిన ఆయుధాలు గాజాలో అమాయక ప్రజల ప్రాణాల్ని బలితీయడం బాధ కలిగిస్తోంది. అక్కడ ఇకపై ఎవరూ ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు. ఈ చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. వాటిని కొనసాగించం. ఇజ్రాయెల్ ప్రత్యేక రాష్ట్రంగా మద్దతిస్తున్నాను కానీ, ఉగ్రవాదానికి కాదు అని సాండర్స్ చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-83.jpg)