జాయినబుల్ కాల్స్ పేరుతో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. గ్రూప్ ఆడియో/ వీడియో కాల్స్‌లో యూజర్లు ఎప్పుడైనా జాయిన్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఏదైనా గ్రూప్ కాల్ నడుస్తున్న సమయంలో కాల్ లిఫ్ట్ చేయకపోతే మళ్లీ కాల్ చేయాల్సి ఉండేది. తాజా ఫీచర్‌తో మళ్లీ కాల్ చేయాల్సిన అవసరం లేకుండా గ్రూప్ కాల్ జాయిన్ కావచ్చు. అంతే కాకుండా ఎప్పుడంటే అప్పుడు కాల్ నుంచి ఎగ్జిట్ కావచ్చు.