వంశీ గ్లోబల్ అవార్డ్స్ చైర్మన్ కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు వంశీ గ్లోబల్ అవార్డ్సు 2021ను ప్రకటించారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు` నార్వే వారు ఆగస్ట్ 28, 29 తేదీలలో అంతర్జాలంలో నిర్వహించబోతున్న కార్యక్రమంలో సమర్పించబోతున్న నాదమంత ప్రాచీనం తెలుగు జాతి చరితం అనే గీతానికి శుభోదయం గ్రూప్ అధిపతి లయన్. డా.కలపటవు శ్రీలక్ష్మి ప్రసాద్ కి ఉత్తమ నిర్మాతగా, గాయకుడు మనోకు ఉత్తమ గాయకునిగా మాధవపెద్ది సురేశ్చంద్రకు ఉత్తమ సంగీత దర్శకునిగా, రాంభట్ల నృశింహ శర్మకు ఉత్తమ గీత రచయితగా అవార్డ్స్ ప్రకటించారు. ఈ అవార్డ్స్‌ను ఆగస్టు 28 తేదీన అంతర్జాలంలో జరుగనున్న తెలుగు భాషా దినోత్సవంలో బహుకరించనున్నారు.