స్మార్ట్ ఫోన్లకు సంబంధించి పాక్‌లో తాజాగా కొత్త అధ్యాయానికి తెర లేచింది. చరిత్రలో తొలిసారిగా ఓ పాకిస్థానీ కంపెనీ 4జీ స్మార్ట్‌ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసింది. పాక్ కంపెనీ ఇనోవీ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోనే తొలిసారిగా 5500 స్మార్ట్ ఫోన్లను యూఏకి ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో పాక్ టెలికాం శాఖ సదరు కంపెనీకి శుభాకాంక్షలు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదుకోవాలని కోరుకుంది. దేశంలో కార్మికశక్తి ఇతర దేశాలతో పోలిస్తే చౌకగా లభిస్తుండటంతో చైనా కంపెనీలు తమ ఉత్పత్తులను పాక్‌లో తయారు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలిసింది.