నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్(100) కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారు. 1970 దశకంలో అమెరికా విదేశాంగ విధానానికి పర్యాయ పదంగా నిలిచారు.మొదట హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. 1973-77 మధ్య అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యం ప్రమేయానికి ముగింపు పలకడంలో సహాయపడినందుకు 1973లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలకు ఆయన కృషి చేశారు. అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావిత విదేశాంగ మంత్రిగా కిసింజర్ పేరు గడించారు. మరణానికి గల కారణాలను ఆయన కన్సల్టింగ్ ఏజెన్సీ వెల్లడించలేదు.
