ఫ్రాన్స్ తదుపరి ప్రధానిగా తన మధ్యేవాద మిత్రపక్ష సభ్యుడు ఫ్రాంకోయిస్ బేరోను ఎంపిక చేసినట్లు అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. గత వారం చారిత్రాత్మక అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో గత ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. మాక్రాన్ సెంట్రిస్ట్ కూటమిలో కీలక భాగస్వామి అయిన 73 ఏళ్ల బేరో అనేక దశాబ్దాలుగా ఫ్రెంచ్ రాజకీయాలలో మంచి పేరున్న నాయకుడు.యూరోపియన్ పార్లమెంట్ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న బేరో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు.