Namaste NRI

న్యూజెర్సీలో  మాటా ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్‌ స్క్రీనింగ్‌ సేవలు

మన అమెరికా తెలుగు సంఘం ( మాటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం, కల్చరల్‌ సెంటర్‌ వద్ద ఫ్రీ హెల్త్‌  స్క్రీనింగ్‌ సేవలు నిర్వహించారు. సాయిదత్త పీఠం నిర్వహకులు రఘు శంకరమంచి జ్యోతి ప్రజ్వల న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో మాటా వాలంటీర్‌ వైద్యులు, జనరల్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌, కంటి పరీక్షలు ( ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో) ఉచిత మందులు ప్లూ షాట్స్‌ అందజేశారు. బటర్‌ ఫ్లై సెంట్రల్‌ ఫార్మసీల సహకారంతో మందులు పంపిణీ చేశారు. పలువురు ఎన్నారైలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. 

కార్యక్రమానికి అతిథులుగా ఎడిసన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నిష్‌ పటేల్‌, సాకేత్‌ చదలవాడ, ఎస్‌డీపీ చైర్మన్‌ రఘు శర్మ శంకరమంచి తదితరులు పాల్గొన్నారు.  ఫ్రీ హెల్త్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో మాటా కోర్‌ టీమ్‌ సభ్యులు నగేష్‌ చిలకపాటి, టోనీ జన్ను, డాక్టర్‌ సరస్వతి లక్కసాని, కళ్యాణి బెల్లంకొండ, మాటా ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌, ఇతర సభ్యులు కీలక పాత్ర పోషించారు. పలువురు విద్యార్థులు, యువత వాలంటీర్స్‌గా తమ సేవలను అందజేశారు. వారి సేవలను గుర్తిస్తూ మాట టీమ్‌ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా  మాటా వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఫ్రీ హెల్త్‌ స్క్రీనింగ్‌ సేవలు ఏర్పాటు చేసినట్లు అన్నారు. అట్లాంటాలో ప్రతి వారం, న్యూజెర్సీలో ప్రతి నెల వైద్య సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఇది తాత్కాలికం కాదని, దీర్ఘకాలిక నిబద్ధత అని అన్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం అవసరమైన వారు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు సమాజానికి మాటా చేస్తున్న సేవలు ఎన్నారైల ప్రశంసలు పొందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

గతంలో మదర్స్‌ డే వేడుకల సందర్భంగా హెల్త్‌ స్క్రీనింగ్‌ సెంటర్స్‌ ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాస్‌ గనగోని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే అట్లాంటాలో ఫ్రీ హెల్త్‌ స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టగా, తాజాగా న్యూజెర్సీలోనూ ప్రారంభించారు. భవిష్యత్‌లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events