యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమాలోని గొలుసుకట్టు ఘోషలు లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేశారు. హృద్యంగా సాగిన ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని అందించడంతో పాటు చారు హరిహరన్‌తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాలను, ఆ పాత్రలోని భావోద్వేగాలను ఈ పాట ఆవిష్కరించింది. ఇటీవలే పవన్ కల్యాణ్ విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నదని సినిమా కూ ఇదే ఆదరణ ఆశిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. శ్రీమతి విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మించారు. మే 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్ : రవితేజ గిరిజాల, సినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్. సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: విజయ లక్ష్మీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్`అఖిల.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/ramcharan-300x160.jpg)