అంజలి కథానాయికగా రూపొందిన హారర్ కామెడీ చిత్రం గీతాంజలి చక్కటి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. శివ తుర్లపాటి దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. తొలిభాగాన్ని మించిన హారర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హైదరాబాద్, ఊటీ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఊటీలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని చిత్ర బృందం పేర్కొంది. వచ్చే ఏడాది ఆరంభంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాణ సంస్థ: కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ.
