Namaste NRI

గ్రీన్‌కార్డ్‌ లభించినా శాశ్వత నివాసం వచ్చినట్లు కాదు :  జెడి.వాన్స్

గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా లో నిరంతరం ఉండలేరని, ఆ హక్కు గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఉండబోదని, అమెరికా ప్రభుత్వం తలచుకుంటే వారిని వారి దేశాలకు డిపోర్ట్ చేయొచ్చ ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి.వాన్స్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ గోల్డ్ కా ర్డ్  ద్వారా విదేశీయులు అమెరికా పౌరసత్వం పొం దొచ్చని, అయితే అందుకు ఐదు మిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంద న్న నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాలస్తీనా అనుకూల కార్యకలాపాలు నిర్వహించినందుకుగాను కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని డిపోర్ట్ చేసే విషయం గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు అనేది ప్రవాస చట్టాన్ని ఉల్లంఘించే చర్యలు చేపట్టనంత వరకు అమెరికాలో ఉండి, పనిచేసుకునే శాశ్వత నివాస హక్కును ఇస్తుంది. అమెరికాలో అత్యధిక గ్రీన్ కా ర్డులు కలిగిన వారిలో రెండో స్థానం భారతీయులదే. అమెరికా అధ్యక్షుడు లేక విదేశాంగ కార్యదర్శి ఏ ప్రవాసి అయినా తమ దేశంలో ఉండకూడదనుకుంటే అలాంటి వారికి చట్టబద్ధంగా నివసించే హక్కు ఉండదు  అని వాన్స్ వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]