Namaste NRI

తల్లి కాబోతున్న గోవా బ్యూటీ ?

తెలుగులో ఒకప్పుడు అగ్ర నాయికగా చెలామణీ అయింది గోవా బ్యూటీ ఇలియానా. ఆమె ఖాతాలో ఎన్నో హిట్‌ చిత్రాలున్నాయి. కొంతకాలంగా సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్న ఈ అమ్మడు సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తాను తల్లి కాబోతున్నట్లు అర్థం స్ఫురించేలా ఫొటోలను పెట్టింది. చిన్నారులు వేసుకునే టీషర్ట్‌తో పాటు మెడలో అమ్మ అని రాసి వున్న లాకెట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ నా లిటిల్‌ డార్లింగ్‌ను చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కమింగ్‌ సూన్‌ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఇలియానా పెట్టిన పోస్ట్‌ ఆమె అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇలియానాను కొందరు నెటిజన్లు మాత్రం అసలు పెళ్లెప్పుడు చేసుకున్నావ్‌? చిన్నారికి తండ్రి ఎవరో చెబితే బాగుంటుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా సింగిల్‌గానే ఉంటున్నది. కత్రినాకైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌ మైఖేల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇలియానా ఇప్పటివరకూ స్పందించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events