Namaste NRI

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ పెట్టుబడులు

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ నగరం కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కార్యలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ గత కొన్నేండ్ల నుంచి పలు మల్టీనేషనల్‌ బ్యాంకుల పెట్టుబడులను హైదరాబాద్‌ ఆకర్షించిందన్నారు. ఈ ఏడాదికి  సంబంధించి ఆ పెట్టుబడుల జాబితా లో గోల్డ్‌మ్యాణ్‌ శాక్స్‌ కంపెనీ చేరడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా రంగాల్లో హైదరాబాద్‌ నగరం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. గడిచిన కొన్నేళ్లలో ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ రంగాల్లో ఇప్పటికే లక్షా 80 వేల మంది హైదరాబాద్‌లో ఉపాధి పొందుతుండడానికి భాగ్యనగరంలో ఉన్న అనుకూలతలే కారణమన్నారు. ఐఎస్‌బీ, ఐఐఎం బెంగళూరు సహకారంతో దేశవ్యాప్తంగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌ సంస్థ లక్ష్యాన్ని అభినందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లో వీ హబ్‌తో కలిసి  పనిచేయాలని కోరారు.

                ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చైన్‌ సాంకేతికతల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. ఆర్థిక రంగంలో మరిన్ని ఆవిష్కరణల రూపకల్పనకు టీ హబ్‌ దోహదపడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలు, 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి గుంజన్‌ సమతాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారులు, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events