యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా దీర్ఘకాలికంగా నివసించేందుకు ఆ దేశం అందజేసే గోల్డెన్ వీసా అవకాశం కల్పిస్తుంది. అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా రెన్యువల్ అవుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇలా ఎమిరేట్స్ జారీచేసే ఈ గోల్డెన్ వీసాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.