దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్`డి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. జైకొవ్`డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది. తాజాగా అత్యవసర వినియోగానికి డీసీజీలకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్‌రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్ ఎఫెక్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 12 ఏళ్ల వారికి కూడా వినియోగించేలా భారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ఏజ్ గ్రూప్ వారికి ట్రయల్స్ చేసిన ఏకైక వ్యాక్సిన్ జైకోవ్`డి కావడం విశేషం.