తానా మహాసభల్లో భాగంగా వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన ధీంతానా పోటీలు జూన్ 8న అట్లాంటాలో కూడా ఘనంగా నిర్వహించారు. డులూత్ పట్టణం, జేడ్ బాంక్వెట్స్ లో నిర్వహించిన ఈ పోటీలు తానా నాయకుల జ్యోతి ప్రజ్వలనతో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముందుగా సోలో సింగింగ్, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించారు.అనంతరం మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పోటీలు నిర్వహించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారిని శాలువా మరియు పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.

వివిధ విభాగాల విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా మెడల్స్, ట్రోఫీస్, క్రౌన్ అందించారు. తానా కళాశాల, తానా పాఠశాల వివరాలను పంచుకున్నారు. తానా పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.డెట్రాయిట్‌లోని నోవై లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలకు అందరినీ ఈ సందర్భంగా తానా నాయకులు ఆహ్వానించారు. పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు అట్లాంటా ధీం-తానా పోటీలకు విచ్చేసి తమ మద్దతు తెలిపారు.

వాలంటీర్స్ కి డిన్నర్ ఏర్పాట్లు చేశారు. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఈ కార్యక్రమానికి కోహోస్ట్ గా వ్యవహరించింది. మాలతి నాగభైరవ, సోహిని అయినాల, పూలని జాస్తి, ఆర్తిక అన్నే, పావని గద్దె, లక్ష్మి మండవల్లి ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించారు.

తానా సౌత్‌ఈస్ట్ ప్రాంతీయ కార్యదర్శి మధుకర్ యార్లగడ్డ సారధ్యంలో తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, భరత్ మద్దినేని, అనీల్ యలమంచిలి తదితరులు ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారందరికీ స్పాన్సర్లకు తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.








