నోయల్, రిషిత నెల్లూరు జంటగా నటిస్తున్న చిత్రం బహిర్భూమి. రాంప్రసాద్ కొండూరు దర్శకుడు. మచ్చ వేణుగోపాల్ నిర్మాత. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మంచి టీమ్‌తో అందరికీ నచ్చేలా తీసిన సినిమా ఇదని హీరో నోయల్ చెప్పారు.బహిర్భూమి పేరుకు ఓ చరిత్ర ఉంది. అప్పట్లో బహిర్భూమి కోసం రెండు ఊళ్ల మధ్య గొడవలు జరిగేవి. ఈ పేరెందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉందని, అక్టోబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నామని, త్వరలో ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.