తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు న్యూజిలాండ్‌లోనీ ఆక్లాండ్‌లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ న్యూజిలాండ్ జగన్ రెడ్డి వొడ్నాల, ఇతర బీఆర్‌ఎస్ ఎన్నారై నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు, ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ కృషిని గుర్తుచేసుకున్నారు.
ఈ దీక్షా దివస్‌లో ఎన్నారై బీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు జగన్ రెడ్డి వొడ్నాల, జనరల్ సెక్రటరీ అరుణ్ ప్రకాశ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామారావు రాచకొండ, గౌరవ అధ్యక్షుడు నరసింహారావు ఎనగంటి, కర్ణాటక న్యూజిలాండ్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ బిరాదార్, నరసింహారావు పుప్పాల, రవీందర్ బొద్దు, సునీల్ ఎర్రబెల్లి, ఆశుతోష్ వొడ్నాల, సాయి భూంపల్లి, న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కసుగంటి, సెక్రటరీ రామ్మోహన్ దంతాల పాల్గొన్నారు.