తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హను-మాన్. దర్శకుడు ప్రశాంత్‌వర్మ. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక భూమిక పోషిస్తున్నది. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియన్స్‌ని అందమైన అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం రామనామంతో, హనుమ తేజంతో, ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాతో సాగింది. హిమాలయా ల్లో హనుమంతుని సాక్షాత్కారం ఈ ట్రైలర్‌లో హైలైట్. దర్శకుడు మాట్లాడుతూ మనందరి ఇష్టదైవం హనుమంతుడు. ఆయనే రియల్ సూపర్‌హీరో. ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత హనుమంతుడు ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి?’ అని తల్లిదండ్రుల్ని పిల్లలు అడుగుతున్నారని తెలిసి చాలా ఆనందించాను.
ఆయన పాత్రను స్పూర్తిగా తీసుకొని నేటి తరానికి తగ్గట్టు తయారు చేసిన కథ ఇది. దాదాపు 1500 థియటర్లలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. మామూలు కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే, వాడు చేసే సాహసాలేంటి? అనేదే ఈ సినిమా అని తేజ సజ్జా అన్నారు. జనవరి 12న పాన్ ఇండియాతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా ఇది విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్.