Namaste NRI

తను నాకెప్పుడూ స్పెషలే : విజయ్‌ దేవరకొండ

తరుణ్‌భాస్కర్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం కీడా కోలా. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె.వివేక్‌ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మాతలు. బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌ విష్ణు, చైతన్యరావు మదాడి, రాగ్‌ మయూర్‌ ప్రధాన పాత్రధారులు.  ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నేను, నాగ్‌అశ్విన్‌, తరుణ్‌భాస్కర్‌, సందీప్‌రెడ్డి వంగా వేరే వేరే చోట పెరిగాం. మా నేపథ్యాలు వేరు. మా నలుగురినీ సినిమా కలిపింది. పెళ్లిచూపులు సినిమాతో నన్ను హీరోను చేశాడు తరుణ్‌భాస్కర్‌. తను నాకెప్పుడూ స్పెషలే  అన్నారు.  

నాగ్‌అశ్విన్‌ ఎవడే సుబ్రమణ్యం నిర్మాణ సమయంలో తరుణ్‌భాస్కర్‌ నాకు పరిచయమయ్యాడు. మేం కలిసి చేసిన పెళ్లిచూపులు సినిమాకు తరుణ్‌కి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. అంత సక్సెస్‌ తర్వాత తను ఏమైనా చేయొచ్చు. కానీ తను నమ్మిందే చేస్తాడు. నచ్చిన స్క్రిప్ట్‌తోనే వెళ్తాడు. తను పరిశ్రమకు దొరికిన అదృష్టం. తరుణ్‌భాస్కర్‌పై నమ్మకంతో చెబుతున్నా. కీడాకోలా కచ్చితంగా మంచి మజానిస్తుంది అన్నారు.  బ్రహ్మానందం మాట్లాడుతూ కుర్రాళ్లతో పనిచేయడంవల్ల యంగ్‌ అనే ఫీలింగ్‌ వచ్చిందని, నన్ను వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి కామెడీ చేయించాలనే ఆలోచన తరుణ్‌భాస్కర్‌లోని కొత్తదనానికి నిదర్శనమని అన్నారు. బ్రహ్మానందంగారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తరుణ్‌భాస్కర్‌ చెప్పారు.  ఈ చిత్రం నవంబర్‌ 3న  విడుదల కానుంది.  ఈ కార్యక్రమంలో రాగ్ మయూర్, చైతన్య రావు, నిర్మాత సాయికృష్ణ, నిర్మాత శ్రీపాద్, రాజా గౌతమ్, వివేక్ సాగర్, రఘురాం, ఆశిష్ తేజ్, పూజిత, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events