ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కల్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్‌ను తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా గత రెండేళ్లుగా చెన్నైలో నిర్మిస్తున్న కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. త్వరలో దానిని ప్రారంభించబోతున్నాం. ఇక బాలకృష్ణగారి తో సినిమా కోసం ఎదురుచూస్తున్నా. ఆయన ఎప్పుడూ చేద్దామన్నా రెడీగా ఉన్నా అన్నారు. ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాలో తొలిసారి అందులో స్కైథియేటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయంపై నియంత్రణ లేకుండా పోయిందని, హిందీలో అరవై రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంటే, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని కల్యాణ్ చెప్పారు.
నిర్మాతగా సినిమాకే నా తొలి ప్రాధాన్యత. వెబ్‌సిరీస్‌లలో శృతిమించిన కంటెంట్ ఉంటుంది. ఆ తరహా సిరీస్‌లను నేను తీయలేను. రాబోవు కాలంలో డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. హీరోలు కూడా ఎక్కువగా వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్తారనుకుంటున్నా’అని ఆయన అన్నారు. అవార్డు వేడుకల గురించి మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ఆర్టిస్టులు అది తమకు గొప్ప గౌరవమని భావించే పరిస్థితులు ఇప్పుడు లేవు. అవార్డు వేడుక అంటే ఇండస్ట్రీ అంతా ఓ కుటుంబంలా హాజరవ్వాలి. ఓ పండగలా చేసుకోవాలి. ఒకప్పుడు అలా జరిగేవి. నేటి పరిస్థితుల్లో అవార్డు వేడుకలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. బాలకృష్ణగారితో వచ్చే ఏడాది సినిమా చేయాలనుకుంటున్నాం. అలాగే మరో రెండు చిత్రాలు సన్నాహాల్లో ఉన్నాయి అని కల్యాణ్ పేర్కొన్నారు.