అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సురక్షితంగా లేరన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కజకస్తాన్‌లోని అస్తానాలో జరిగిన సీఎస్టీవో సదస్సులో పుతిన్ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీర పట్ల పుతిన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో అనాగరిక పద్ధతిలో పోరు జరిగిందన్నారు. అనేక మార్లు ట్రంప్‌పై హత్యాయత్నాలు కూడా జరిగినట్లు చెప్పారు. నా దృష్టిలో ట్రంప్ సేఫ్‌గా లేరని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ జరగని రీతిలో అనేక సంఘటన లు ఇటీవల జరిగినట్లు తెలిపారు. ట్రంప్‌పై ప్రశంసలు కురపించారు పుతిన్. ఆయన అనుభవం ఉన్న, ఇంటెలిజెంట్ నాయకుడన్నారు. ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.