అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా ఇప్పటికే చరిత్ర సృష్టిం చారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్ చివరి లెక్కింపు జరిగిన అరిజోనా రాష్ట్రంలోనూ పైచేయి సాధించారు. అంతేకాదు ఏకంగా ఏడు స్వింగ్ స్టేట్స్‌లోనూ ఆయన జయభేరి మోగించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Mayfair-30.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి ఫలితం కూడా ట్రంప్ వశమైంది. గ్రాండ్ కానియన్ స్టేట్ అయిన అరిజోనా లో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా ట్రంప్ కైవసం చేసకున్నారు. దాంతో, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లు కొల్లగొట్టగా, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితం అయింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Ixora-30.png)