
హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ పానిండియా థ్రిల్లర్ సంబరాల యేటిగట్టు. రోహిత్ కెపి దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. టీమ్ మొత్తం హోలీ సంబరాన్ని జరుపుకుంటూ ఆనందంతో నిడివున్నట్టు ఈ పోస్టర్ చెబుతున్నది. సాయిదర్గతేజ్ టీమ్‌ను ఉత్సాహపరుస్తూ తన చేతిని పైకెత్తడం ఈ పోస్టర్లో చూడొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నదని, సెప్టెంబర్ 25న పానిండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్.
