Namaste NRI

హృతిక్ రోషన్ ఫైటర్ ‌టీజ‌ర్ విడుద‌ల

 బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ న‌టిస్తున్న తాజా చిత్రం ఫైటర్ . సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వం. ‌ ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇక టీజ‌ర్ చూస్తే ఒక్క డైలాగ్ లేకుండా టీజ‌ర్ మొత్తం యాక్ష‌న్ సన్నివేశాలతో ఉంది. మమ్మల్ని కనుగొనాలంటే? మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే? మీరు జోక్ చేయాలి. అంటూ డైలాగ్స్‌తో టీజ‌ర్ ఉండ‌గా హృతిక్ రోషన్, దీపికా పదుకొనేల‌ అసాధారణ నైపుణ్యాల‌ను హైలైట్ చేసే విధంగా టీజ‌ర్ సాగింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా,  స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే), గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నాడు. ఈ మూవీని వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫైటర్‌ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events