చైతన్యకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం బ్రీత్. వైద్యో నారాయణో హరి ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. బసవతారక రామా క్రియేషన్స్ పతాకంపై నందమూరి జయకృష్ణ నిర్మించారు. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యకృష్ణ మాట్లాడుతూ మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా అలరిస్తుంది. మా తాతగారు నందమూరి తారక రామారావు, నానమ్మ బసవతారకం ఆశీస్సులతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో నటుడిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటా అన్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు వంశీకృష్ణ తెలిపారు. నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ చైతన్యకృష్ణ అద్భుతంగా నటించాడని, సినిమా చూసినవారందరూ గొప్ప సందేశం ఉందని మెచ్చుకున్నారు.
