అమెరికాలో ఐడా తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 65 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. మొత్తంగా భారత సంతతికి చెందిన నలుగురు మరణించారు. న్యూజెర్సీలో మాలతి కంచె (46), ధనుష్‌రెడ్డి (31) వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు. మురుగునీటి పైపులో పడి కొట్టుకుపోయిన ధనుష్ మృతదేహం కొన్ని కిలోమీటర్ల దూరంలో దొరికినట్టు అధికారులు తెలిపారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, అమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు వీరిది ప్రేమ వివాహం. న్యూయార్క్‌లోని భారత సంతతికి చెందిన ధామేశ్వర్ ఇంట్లోకి వరదనీళ్లు రావడంతో ఆయన భార్య, కుమారుడు కొట్టుకుపోయి మరణించారు.