
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దిల్ రూబా. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. విశ్వకరుణ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. వారిని ఓ శత్రువులా భావిస్తాం. కానీ ఈ సినిమ చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో మాజీ ప్రేయసి గురించి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అన్నారు. వీలైతే ఈ సినిమాను ఎక్స్ లవర్‌తో చూడాలని, థియేటర్ నుంచి బయటకు వచ్చేముందు మంచి ఫ్రెండ్‌షిప్ ఫీలింగ్‌తో వస్తారని, ప్రేమలోని సరికొత్త పాయింట్‌ను సినిమాలో చర్చించామని తెలిపారు.

ప్రేమకంటే అది పంచే వ్యక్తులే గొప్పవారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని దర్శకుడు పేర్కొన్నారు. ఫీల్‌గుడ్ మూవీ ఇదని, అందరికి నచ్చుతుందని నిర్మాత రవి అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన అంజలి క్యారెక్టర్ గుర్తుండిపోతుందని కథానాయిక రుక్సర్ థిల్లాన్ చెప్పింది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మోహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రచన-దర్శకత్వం: విశ్వ కరుణ్.
