Namaste NRI

అమెరికా ఆరోపణలపై భారత్‌ సీరియస్‌‌

అమెరికాలో ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నును హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్‌ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అమెరికాలో పన్నుని చంపేందుకు విఫల ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఇందులో భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే భారత్‌ స్పందించింది.

తాజాగా ఈ వ్యవహారంపై విచారణ కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. భారత్-అమెరికా భద్రతా సహకారంపై చర్చ సందర్భంగా వ్యవస్థీకృత నేరస్థులు, గన్ రన్నర్స్‌, ఉగ్రవాదులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌ తనవంతుగా అమెరికా పక్షం నుంచి సమాచారాన్ని సేకరించింది, దాన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య వ్యవహారంలో ఇప్పటికే భారత్‌, కెనడా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events