బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారి తీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ దేశ రాజకీయ ప్రముఖులు, బ్రిటిష్ భారతీయులు ఎంతోమంది హాజరయ్యారు. ప్రధాని ఏర్పాటుచేసిన విందులో కబాబ్‌లు, బీర్, వైన్ మొదలైనవి మెనూలో కనిపించటంతో బ్రిటిష్ హిందువులంతా షాక్‌కు గురయ్యారు.
దీపావళి వేడుకను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కించపర్చారని ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీశ్ కే శర్మ విమర్శించారు. ఈ వార్త తనను ఎంతగానో నిరుత్సాహపర్చిందన్నారు. ప్రధాని స్టార్మర్ ముఖ్య సలహాదారు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఇలా జరిగి ఉండొచ్చునని బ్రిటిష్ హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈవెంట్‌ను నిర్వహించకపోవటం కన్నా, శ్రద్ధ లేకుండా నిర్వహించటంతో ఎక్కువ హాని జరిగిందని అక్కడి భారతీయ సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.