తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరణ నిరాహార దీక్ష చేపట్టి 15 ఏండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యం లో జరిగింది. బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మర్చిపోలేని రోజు అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్ర లో నిలిచిపోయే శుభదినం అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల తెంగాణ ప్రజలు ముక్త కంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారన్నారు.
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కదిలించిన సందర్భం దీక్షా దివస్. అందర్నీ మెప్పించి ఒప్పించి, దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులమతాలకు అతీతంగా అందరిని కలిపిన సందర్భమే దీక్షా దివస్. నాటికి, నేటికీ ఏం మారింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మేలిమి బంగారంగా మార్చుకు న్నాం. అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమ ఫలాలు అనుభవించాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలైన హామీలు ప్రతి ఇంటికీ చేరినయి.ప్రజల మదిలో చెరగని ముద్ర వేసి, చరిత్ర మరవని నిజమైన ప్రజా పాలన కు నిదర్శనంగా నిలిచినయి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ , కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం , వెంకటేష్, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.