అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్) మధ్యవర్తుల కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. పీవీ నరసింహారావు హయంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. అయితే ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పరిశ్రమలకు ఆర్బిట్రేషన్ కేంద్రంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు జడ్జిలు ఎల్ నాగేశ్వరరావు, ఆర్.సుభాష్ రెడ్డి, హైకోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.