భారతదేశమంతటా 75వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలను ఘనంగా జరిగాయి. విదేశాల్లోని భారతీయులందరూ కూడా తమ దేశభక్తిని చాటుతూ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖులు భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన ఓ బాలిక మాత్రం భారతీయులకు వినూత్నంగా పంద్రాగస్టు విషెష్ తెలిపారు. వాయిద్య పరికరం సంతూర్‌పై జన గణ మన ఆలపించి భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇరాన్‌కు చెందిన 13 ఏండ్ల బాలిక తారా ఘహ్రేమణి జన గణ మన ఆలపించే ముందు.. భారతీయ స్నేహితులందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపింది. పసుపు రంగు వస్త్రాలు ధరించిన ఆమె ఎంతో అభినయంతో జన గణ మనను ఆలపించారు.