దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ లే అవుట్‌లో 57 అంతస్తుల భవనాన్ని సాస్ క్రౌన్ పేరుతో నిర్మించనున్నారు. దీని నిర్మాణం 4.5 ఎకరాల్లో జరుగుతుండగా 5 టవర్లలో 235 ఇళ్లును నిర్మించబోతున్నారు. ఈ భవనం బెంగళూరులో ఇప్పటికే ఉన్న 50 అంతస్తుల భవనం రికార్డును అధిగమించి దక్షిణ భారతదేశంలోనే అత్యంత విలువైన, ఎత్తయిన భవనంగా నిలుస్తుందని భవన నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ భవనాన్ని సాస్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ నిర్మించనుంది.
57 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి (హెచ్‌ఎండీఏ) అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని, మొదటి దశ పనులు 2025 ఏడాది నాటికి పూర్తవుతాయని సాస్ ఇన్‌ఫ్రా ప్రతినిధి ఆశీష్ భట్టాచార్య తెలిపారు. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ.. 8,811 చ.అ.లలో అపార్ట్‌మెంట్ విస్తీర్ణాలుంటాయి. ఈ భవనంలో ఒక చదరపు అడుగు రూ.8950 ధర పలుకుతుందని పేర్కొన్నారు. ఇక్క ఇల్లు రూ. 6 కోట్ల ఖరీదు ఉండనుంది. ఇప్పటికే 60`70 యూనిట్లు విక్రయమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారి వెల్లడిరచారు. హైదరాబాద్ నగరంలో ఇదే ప్రథమ అల్ట్రా అగ్జరీ అపార్ట్‌మెంట్ కావడం విశేషం. ఓఆర్‌ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీG42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా రానున్నట్లు తెలిపారు.