వెయ్యి డాలర్ల (సుమారు రూ.83 వేలు) డబ్బు కోసం అమెరికాలోని ఓ జంట కన్నబిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించింది. నిందితులను నార్త్ వెస్ట్ అర్కాన్సస్‌కు చెందిన డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్‌గా గుర్తించిన పోలీసులు, వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మూడు నెలల పిల్లాడిని వారు బీరు, డబ్బు కోసం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.అయితే అధికారులు వచ్చేసరికి బిడ్డ తల్లిదండ్రులు అక్కడ లేరు. బిడ్డను అధికారులు దవాఖానకు తరలించారు. బిడ్డ తల్లిదండ్రులు నివసించిన గుడారంలో వారు తమ బిడ్డను వెయ్యి డాలర్లకు అమ్మేయడానికి అంగీకరించిన లేఖను అధికారులు గుర్తించారు. తమ ఆలోచనలు మారవని, బిడ్డ కోసం సంప్రదించమని వారు అందులో పేర్కొన్నారు.